కొందరు ప్రేమ పెళ్లి చేసుకోవాలి అని భావించినా పెద్దలు ఒప్పుకోరు.. దీంతో చేసేది లేక పారిపోయి పెళ్లి చేసుకుంటారు, ఈలోపు వారు మేజర్లు అయితే ఒకే , కాకుండా మైనర్లు అయితే దీనిపై పంచాయతీ జరుగుతుంది. స్టేషన్ లో కేసు పెడతారు.. ఆ పెళ్లి చెల్లదు.. ఇక మేజర్లు అయితే వారి పెళ్లికి ఎవరూ అడ్డు చెప్పలేరు, ఇక తాజాగా ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్లో జరిగిన ఓ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..
ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో లేచిపోదామని ప్రయత్నించారు. ఇక ప్రేయసిని చూడాలి అని ఆమె ఇంటికి వెళ్లాడు ప్రియుడు, చివరకు అడ్డంగా ఆమె కుటుంబ సభ్యులకి దొరికపోయాడు, వెంటనే వారి కుటుంబ సభ్యులు అతనిని పట్టుకుని చితక్కొట్టారు.
మరుసటి రోజు పెళ్లి చేసి అల్లుడిని చేసుకున్నారు. ముందు రోజు రాత్రి ఇంట్లో ఇలా దొరకడంతో వెంటనే ఆమె తండ్రి అన్నలు బంధువులు అందరూ అతడిని ఓ రూంలో బంధించి రాత్రంతా చితకబాదారు. తెల్లవారుజామున పోలీసులకు అప్పంగించారు. ఇక పరువు కూడా పోతుంది కాబట్టి ఆమె విషయంలో అన్నీ ఆలోచించి అతనికి ఇచ్చి వివాహం చేయించారు, ఓ పక్క స్వీట్లు పెడుతూ మరోపక్క దెబ్బలకు ఆయిట్మెంట్ రాస్తున్నారు ఆమె కుటుంబసభ్యులు ఈ పెళ్లి కొడుక్కి.