ఒక్క ట్వీట్ తో అత‌నికి ల‌క్ష కోట్లు లాస్ ప్ర‌పంచం షాక్

ఒక్క ట్వీట్ తో అత‌నికి ల‌క్ష కోట్లు లాస్ ప్ర‌పంచం షాక్

0
89

ఏదైనా ఒక చిన్న త‌ప్పు చేస్తే ఇక అది ఎలాంటి ఇబ్బంది క‌లిగిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.. చిన్న త‌ప్పు వ్యాపారాల్లో కోట్ల న‌ష్టం కూడా క‌లిగిస్తుంది, ఒక వ్య‌క్తి చేసిన ట్వీట్ ల‌క్ష కోట్ల న‌ష్టం తెప్పించింది.. న‌మ్మ‌లేక‌పో‌తున్నారా అవును నిజంగా ఈ స్టోరీ వింటే మ‌తిపోతుంది.

అమెరికాకు చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ టెస్లా బాస్ ఎలన్ మాస్క్. చాలా వ‌ర‌కూ అంద‌రికి తెలిసిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, అయితే తాజాగా ఆయ‌న కంపెనీ విష‌యంలో ఓ ట్వీట్ చేశాడు,
టెస్లా షేరు ధర చాలా ఎక్కువ అని ట్వీట్ చేశారు. అంతే కంపెనీ షేరు ధర పడిపోయింది. కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ఏకంగా 14 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది.

దీంతో ఆయ‌న కంపెనీ ఉద్యోగులు ప్ర‌మోటర్లు షేర్ హోల్డ‌ర్లు అంద‌రూ షాక్ అయ్యారు, 141 బిలియ‌న్ డాల‌ర్లు ఉండే కంపెనీ విలువ‌ ఏకంగా ఇప్పుడుదారుణంగా 127 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది, అంటే
రూ.లక్ష కోట్లు లాస్. అలాగే ఎలన్ మాస్క్ వాటా కూడా 3 బిలియన్ డాలర్లు త‌గ్గింది. మన కరెన్సీలో దాదాపు రూ.20 వేల కోట్లు. ఎలన్ మాస్క్ ట్వీట్ చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్దం దీంతో అత‌ను సీఈవో ప‌ద‌వి కోల్పోతారు అని తెలుస్తోంది.