పెసలు ఇలా తింటే ఇక మీరు హీరోలని మించి తయారు అవుతారు

పెసలు ఇలా తింటే ఇక మీరు హీరోలని మించి తయారు అవుతారు

0
101

మనుషులు పుట్టినప్పటినుండి చనిపోయినంత వరకు ఒకేలా వుండరు, కాబట్టి ప్రతిఒక్కరు మంచి ఆరోగ్యంతో ఉండటం ముఖ్యం.. దీనికి ఒక ఉదాహరణగా మొలకెత్తిన పెసలు అని చెప్పవచ్చు.. ఇలా మొలకెత్తిన పెసలు తినడం వల్ల మనిషి యవ్వనంగా వుంటాడు .. పోషకాలు ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కూడా చాలా బాగుంటుంది.. ముఖ్యంగా వయసు పైబడుతుందని బాధపడేవారు ఈ పెసలను తినడం వల్ల ఇటువంటి బాధ నుండి తప్పించుకోవచ్చు..

పోషకాహార నిపుణులు వారి యొక్క పరిశీలనలో ఈ ఆహారాన్ని తీసుకుంటే మంచిది అని చెబుతున్నారు.. ఈ ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.. అలాగే చర్మం ముడతలు పడకుండా మనిషి శరీర భాగాలకు కూడా శక్తిని అందిస్తాయి..

ఈ మొలకెత్తిన పెసలలో కాపర్ అధిక స్థాయి లో ఉండటం వల్ల చర్మానికి ముడతలు రాకుండా సంరక్షిస్తుంది.. అలాగే శరీరానికి కూడా బలం చేకూరుతుంది.. దీనిలో కాపర్ తో పాటుగా అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.. మానవ శరీరంలోకి ప్రసరించే కాన్సర్ కారక కణాలను కూడా ఇవి నిరోధిస్తాయి..

ఈ మొలకెత్తిన పెసలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటగా ఒక 50 గ్రాముల పెసలను ఒక గిన్నె లోకి తీసుకుని రాత్రంతా నీటిలో నానపెట్టాలి.. మరుసటి రోజు ఉదయానికి ఈ పెసలు మొలకెత్తుతాయి.. ఇలా మొలకెత్తిన పెసలలో పోషకాలు అధిక స్థాయిలో వుంటాయి.. వీటిని మార్నింగ్ టిఫిన్ కు బదులుగా లేదా ఈవెనింగ్ స్నాక్స్ టైం లో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది…