ఈ లాక్ డౌన్ వేళ ఇష్టం వచ్చిన రేట్లకు కొన్ని సరుకులు అమ్ముతున్నారు వ్యాపారులు, అయితే మద్యం కూడా ముందు దొరకలేదు, కాని ఇప్పుడు రెడ్ కంటైన్ మెంట్ ప్రాంతాలు మినహా అన్ని చోట్లా దొరుకుతోంది, అయితే కొందరు రోడ్ జోన్ లోకి మద్యం తీసుకువెళ్లేందుకు అనేక ప్లాన్లు వేస్తున్నారు..
తాజాగా బీహర్ లో కొందరు పనస కాయలు అమ్మేవారు రెడ్ జోన్ లోకి బండ్లపై పనస కాయలు తీసుకువెళుతున్నారు అమ్మేందుకు, అయితే అందులో ముందే వైన్ బాటిల్స్ పెట్టి ఫెవిక్విక్ ,గమ్ అంటిస్తున్నారట, వీటిని చూసి పోలీసులు పనస కాయలు అనుకున్నారు.
ఎవరికి అనుమానం రాలేదు.. కాని ఓ వ్యక్తి మాత్రం సరిగ్గా గమ్ పెట్టలేదు దీంతో అక్కడ రాకేష్ సింగ్ అనే అధికారి పనస కాయ కోయగా అందులో విస్కీ బాటిల్ కనిపించింది, దీంతో వారికి మద్యం ఇలా సీక్రెట్ గా తీసుకువెళుతున్నాం అని చెప్పాడు.. అంతేకాదు పనస కాయ రేటు కూడా మద్యానికి యాడ్ చేస్తారట, దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు, ఫోన్లో ఇలా మద్యం ఆర్డర్ ఇస్తున్నారట.