నా జీవితం ఆ టాప్ హీరో, టాప్ డైరెక్టర్లే నాశనం చేశారు… హీరోయిన్

నా జీవితం ఆ టాప్ హీరో, టాప్ డైరెక్టర్లే నాశనం చేశారు... హీరోయిన్

0
121

కొంతమందికి అదృష్టం బాగుంటే దిశ దశ మారిపోతుందంటారు… మరికొంతమందికి వారి అందం దశను మార్చేస్తుందంటారు… అయితే ఈ రెండు ఉంటేనే చలన చిత్రంలో సక్సెస్ అవుతారన్నది నగ్న సత్యం… అందంతోపాటు అదృష్టం వరిస్తే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు… లేదంటే నిలదొక్కుకోలేరని చాలామంది హీరో, హీరోయిన్స్ చూస్తే అర్ధం అవుతోంది…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్సా మూవీ అందరికీ గుర్తే ఉంటుంది… ఈ చిత్రంలోని సాంగ్ ఎంత హిట్ అయ్యాయే అందరికీ తెలుసు… పవన్ కు రెండో హీరోయిన్ గా పార్వతీ మెల్డన్ నటించిన సంగతి తెలిసిందే… ఆ తర్వాత దూకుడులో మహేష్ బాబుతో స్టెప్పులు వేసింది పార్వతీ… దాని తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో అదృష్టం తలుపు తట్టలేదు…

దీంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది పార్వతీ మెల్డన్… తాజాగా ఈమె ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది… ఈ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది… తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోకపోవడానికి కారణం ఒక దర్శకుడే అని చెప్పింది… అతని వల్లే ఇండస్ట్రీలో అడుగు పెట్టానని చెప్పింది…

ఆ దర్శకుడుతో పాటు టాప్ హీరో చేసిన మోసం వల్లే తన సినిమా కెరియర్ నాశనం అయిందని చెప్పింది… అయితే వారి పేర్లు మాత్రం చెప్పలేదు… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది…