పాత్ర‌లు క‌డుగుతుంటే సింక్ లో నుంచి ఏమి వ‌చ్చిందో చూసి షాక్

పాత్ర‌లు క‌డుగుతుంటే సింక్ లో నుంచి ఏమి వ‌చ్చిందో చూసి షాక్

0
96

ఆద‌మ‌రిస్తే పెను ప్ర‌మాదం జ‌రిగేది… కాస్త ఏదో ఆలోచ‌న‌లో ఉన్నా పెను ప్ర‌మాధ‌మే సంభ‌వించేది,
క్వీన్స్‌లాండ్‌కు చెందిన మైకేల్ ఇంట్లో సింక్ ద‌గ్గ‌ర త‌న వంట పాత్ర‌లు క‌డుతున్నాడు.. ట్యాప్ ఆన్ చేసి పాత్రలు తోమడం ప్రారంభించగా సింక్‌లో బుసలు కొడుతూ కనిపించిన పాముని చూశాడు, దీంతో షాక్ కొట్టినంత పనైంది.

వెంట‌నే దానిని బంధించేందుకు స్నేక్ గార్డుల‌కి స‌మాచారం ఇచ్చాడు, వారు వచ్చేలోపు త‌న కెమెరాలో దాని విన్యాసాలు బంధించాడు, త‌ర్వాత ఆ పాము అక్క‌డే చాలా సేపు ఉండిపోయింది, మ‌ళ్లీ సింక్ లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేదు, ఈ స‌మ‌యంలో స్నేక్ గార్డ్ లు వ‌చ్చి దానిని ప‌ట్టుకున్నారు.

దేవుడి దయ వల్ల ఆ పాము నన్నేమీ చేయలేదంటూ వీడియో పోస్ట్ చేశాడు, మొత్తానికి అది విష‌పూరిత పాము అని చెప్పారు స్నేక్ గార్డ్స్ . అతని కిచెన్‌లో బయటపడ్డ పాము ప్రపంచంలోనే రెండో అత్యంత విషమైన ఈస్టర్న్ బ్రౌన్ పాము అది కానీ కాటు వేసిందంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే అని చెప్పారు, దీంతో అత‌ను తీవ్ర భ‌యానికి లోన‌య్యాడు.