ప్రపంచంలో పులులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదో తెలుసా?

ప్రపంచంలో పులులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదో తెలుసా?

0
127
Tigers

పులులని మనం అడవుల్లో చూస్తాం లేదా జూలో చూస్తాం, కాని ఈ రోజుల్లో మాత్రం పులుల సంఖ్య భారీగా తగ్గుతోంది, ఏకంగా జనం నివసించే ప్రాంతాల్లోకి అడవుల నుంచి వస్తున్నాయి, వేటగాళ్ల ఉచ్చుకి కొన్నిబలి అవుతున్నాయి.

అయితే మన ప్రపంచంలో అత్యధికంగా పులులు ఉన్న ప్రాంతం ఏదో తెలుసా మన దేశమే.. ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 70 శాతం భారత్లోనే ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ
మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు.

మన దేశంలో ఇలా పులుల పెంచేందుకు టైగర్ రిజర్వులు ఉన్నాయి. 1973లో మనకు కేవలం తొమ్మిది టైగర్ రిజర్వులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 50కి చేరింది.అలాగే . భారత్లో 30 వేల ఏనుగులు, 3 వేల ఖడ్గమృగాలు, 500 సింహాలు ఉన్నాయి..ఇక భారత్, బంగ్లాదేశ్, భూటాన్, కాంబోడియా, చైనా, ఇండోనేషియా, మలేషియా, మాయన్మార్, నేపాల్, రష్యా, థాయ్లాండ్, వియత్నాం, ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి.

మన దేశంలో పులులు ఎక్కువ మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, తర్వాత కర్ణాటకాలో ఎక్కువ పులులు ఉన్నాయి, పదేళ్లలో పులుల సంఖ్య 1,796 నుంచి 2,967కి చేరింది మన దేశంలో.