జగపతిబాబు అన్న కూతురితో రాజమౌళి కొడుకు పెళ్లి…..

జగపతిబాబు అన్న కూతురితో రాజమౌళి కొడుకు పెళ్లి.....

0
158

ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ నటుడు జగపతిబాబుకి అల్లుడు అవుతున్నాడు . కార్తికేయ జగపతిబాబు లు మామా అల్లుళ్ళు ఏంటి ? అని అనుకుంటున్నారా ? జగపతి బాబు అన్నయ్య రాంప్రసాద్ కుమార్తె ని రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రేమించాడు దాంతో ఇరు కుటుంబాలు ఆమోదం తెలపడంతో వివాహ నిశ్చితార్థం జరిగింది దాంతో జగపతిబాబు – కార్తికేయ లు మామా అల్లుళ్ళు అవుతున్నారు . జగపతిబాబు అన్నయ్య రాంప్రసాద్ కూతురు పూజా ప్రసాద్ మంచి గాయని కూడా . పలు భక్తిరస పాటలు పాడి శ్రోతలను పరవశింపజేసింది .

నిన్న కొంతమంది శ్రేయోభిలాషుల మధ్య ఈ వివాహ నిశ్చితార్ధ వేడుక జరిగింది . ఇక తనకు కాబోయే భార్య తో కలిసి ఉన్న ఫోటో ని కార్తికేయ ట్వీట్ చేస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు . ఈ పెళ్లి తో జగపతిబాబు కుటుంబానికి రాజమౌళి కుటుంబంతో బంధుత్వం ఏర్పడుతోంది . కార్తికేయ సాంకేతిక నిపుణుడిగా ప్రతిభ చాటుకుంటున్నాడు . రాజమౌళి చిత్రాలకు కీలక బాధ్యత అంతా కార్తికేయ దే అన్న విషయం అందరికీ తెలిసిందే .