ఎన్టీఆర్ బ‌యోఫిక్ లో ర‌కుల్ పారితోష‌కం తెలిస్తే షాక్

ఎన్టీఆర్ బ‌యోఫిక్ లో ర‌కుల్ పారితోష‌కం తెలిస్తే షాక్

0
141

మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు బ‌యోపిక్ సినిమా కోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎంతో అస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర‌లో ఆయ‌న కుమారుడు హీరో బాల‌కృష్ణ న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ప‌లు కీల‌కమై ఘ‌ట్టాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో షూటింగ్ జ‌రుగుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ ర‌కులు 20 నిమిషాల‌పాటు న‌టిస్తుంది. ఎన్టీఆర్ కాంబినేష‌న్లో వ‌చ్చిన కొన్ని హిట్ చిత్రాలు గ‌తంలో వ‌చ్చాయి క‌నుక ఎన్టీఆర్ కథానాయ‌కుడు చిత్రంలో శ్రీదేవి పాత్రకు ర‌కుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారు. సుమారు 20 నిమిషాల‌పాటు సీనిమాలో నటించ‌బోతున్నందుకు ఈ ముద్దుగుమ్మ‌కు కోటీ రూపాయ‌లు ముట్టిన‌ట్లు ఫిలిమ్ న‌గ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతుంది.

ప్ర‌స్తుతం ర‌కుల్ కు హిందీ, త‌మిల్, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల్లో మంచి క్రేజ్ ఉన్నందును ఆమెకు చిత్ర‌యూనిట్ కోటి రూపాయ‌లు ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక మ‌రో వైపు సోష‌ల్ మీడియాలో ర‌కుల్ కు సంబంధించి ఒక వార్త వైర‌ల్ అవుతుంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుత‌న్న ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ర‌కుల్ అశించిన స్థాయిలో నంద‌మూరి అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు.