రాముడు బాణం ఎడమ – కుడి ఏ చేతితో వదిలేవాడు?

రాముడు బాణం ఎడమ - కుడి ఏ చేతితో వదిలేవాడు?

0
246

శ్రీరాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఆ అయోధ్య రామయ్యకు దేవాలయం నిర్మిస్తున్నారు, అయితే ఆ రామయ్య విలు విద్య నేర్చుకున్న సమయంలో ఆయన ఎంతో మంది రాక్షసులకి తన బాణంతో సమాధానం చెప్పారు, రామబాణం తగిలితే వారి జన్మధన్యం అయింది అనుకున్న వారు కూడా ఉన్నారు.

ఇలా రామబాణం గురించి ఎన్నో కధలు మనం విన్నాం. అయితే శ్రీరాముడిది కుడి చేతి వాటమా ? లేక ఆయన ఎడమ చేయిని ఎక్కువగా ఉపయోగించేవాడా అనేది చూస్తే దీనికి ఆనాడు సీతా దేవి చెప్పిన మాటల బట్టీ మనకు సమాధానం దొరుకుతుంది.

సీతా దేవి తన భర్త రాముడు గురించి అనేక విషయాలు రావణుడికి చెబుతుంది, నా భర్త
అత్యంత ఘనమైన కీర్తి కలవాడు, కపటం తెలియని, అత్యంత పరిపూర్ణమైన వ్యక్తి అని చెబుతుంది,
సవ్యసాచి అని ఆ రాముడు గురించి చెబుతుంది.

అంటే రెండు చేతులను సమానంగా వాడగలిగేవాడు శ్రీరాముడు, అలా సవ్యసాచి అని చెప్పడంతో ఆయన బాణం ఏ చేతితో అయినా సందించగలడు అనేది తెలిసింది. ఇక ఎక్కువగా బాణాలు మాత్రం ఆయన కుడిచేతితోనే వేసేవారట.