రోడ్డు మీద వారికి కవర్ కనిపించింది ఓపెన్ చేసి చూసి షాకైన కుటుంబం

రోడ్డు మీద వారికి కవర్ కనిపించింది ఓపెన్ చేసి చూసి షాకైన కుటుంబం

0
93

వారి కుటుంబానికి రోడ్డుపై నగదు దొరికింది, కాని అతను ఏం చేశాడో తెలుసా, అంత భారీ నగదు దొరికితే చాలా మంది ఇంటికి పట్టుకు వెళ్లి దాచుకుంటారు… కాని ఇతను మాత్రం ఆ నగదుని తిరిగి యజమానికి అప్పగించాడు, అమెరికన్ల ప్రశంసలు పొందాడు, ఆ స్టోరీ ఏమిటి అంటే, అమెరికాలో డేవిడ్, ఎమిలీ షాంజ్ దంపతులు తమ పిల్లలతో కలిసి కారులో సరదాగా రోడ్డు మీదకు వచ్చారు.

ఈ సమయంలో రోడ్డుపై అడ్డంగా ఓ కవర్ పడి ఉంది, వెంటనే ఏమిటా అని చూశారు, చుట్టు ఎవరూ లేరు, దీంతో ఆ బ్యాగుని తన కారులో వేసుకుని ఇంటికి వెళ్లారు, అందులో ఏముంది అని చూస్తే, అంతా కొత్త కరెన్సీ కట్టలు…అన్నీ డాలర్స్, మొత్తం లెక్కపెడితే ఒక మిలియన్ డాలర్స్ , మన కరెన్సీలో 7 కోట్ల రూపాయలు.

ఇక వెంటనే ఈ డబ్బు బ్యాగ్ పై అడ్రస్ చూసి వారికి , అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చారు, వెంటనే వారు ఈనగదు పోలీసులకు అప్పగించారు.. వారు బ్యాగు ఓనర్ కు అప్పగించారు, ఇంత సాయం చేసినందుకు మీకు మంచి బహుమతి త్వరలో పంపుతాం అని , ఆ బ్యాగు ఓనర్ చెప్పాడు, ఈ కుటుంబం చేసిన పనికి అమెరికన్లు వారిని ప్రశంసిస్తున్నారు.