సాధారణ ఉద్యోగి కోట్లరూపాయల కారుకొన్నాడు అతను ఏం చేస్తున్నాడో తెలిసి షాకైన కంపెనీ చైర్మన్

సాధారణ ఉద్యోగి కోట్లరూపాయల కారుకొన్నాడు అతను ఏం చేస్తున్నాడో తెలిసి షాకైన కంపెనీ చైర్మన్

0
95

కొందరు ఉద్యోగులు తమ కంపెనీకి వెనుక నుంచి కన్నాలు పెట్టి ఆర్దికంగా చాలా వెనకేసుకుంటారు.. అయితే వారి పాపం పండే వరకే అది, తర్వాత వారికి చిప్పకూడే గతి, నిజమే దొరికితే దొంగ దొరకకపోతే దొర అని ఊరికినే అనలేదు కదా, అలాగే జరిగింది ఇది కూడా, దుబాయ్ లో నెల జీతం మీద ఆధారపడే ఓ ఉద్యోగి కోట్ల రూపాయల విలువ చేసే కారు కొన్నాడు దీంతో అందరూ షాక్ అయ్యారు.

ఒమన్కు చెందిన నిందితుడు దుబాయిలోని టెలికమ్యూనికేషన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీలో నిందితుడు చేయాల్సిన పనేంటంటే.. కస్టమర్ల నుంచి డ్యామేజ్ అయిన రీచార్జ్ స్క్రాచ్ కార్డ్స్ను తీసుకుని వారికి వేరే స్క్రాచ్ కార్డ్లను ఇవ్వడం. అలా తీసుకున్న కార్డులు ఎర్రర్ చేసి వాటిని డీలీట్ చేయడం .

అయితే ఇతనికి కోట్ల రూపాయల కార్డులు వచ్చాయి వాటిని క్యాన్సిల్ చేయాలి కాని అతను చేయలేదు.. ఇలా 2015 నుంచి 2018 మధ్య నిందితుడు ఆ డ్యామేజ్ కార్డ్ల ద్వారా 14.7 మిలియన్ దిర్హామ్(రూ. 28 కోట్ల 50 లక్షలు)లు సంపాదించాడు. దీంతో అతని నుంచి ఈ నగదు కంపెనీ తాజాగా స్వాధీనం చేసుకుంది ..కారు ఇంత ఖీరదైనది కొనడంతో అతని సీన్ మొత్తం కంపెనీకి తెలిసి ఉద్యోగం నుంచి తొలగించింది, చివరకు పోలీసుల అదుపులో ఉన్నాడు, అతను వాడే వాచ్ కూడా ఆ కంపెనీ చైర్మన్ వాడే వాచ్ కంటే ఖరీదైనది సుమారు 80 లక్షలట.