శైలజారెడ్డి అల్లుడు సినిమా స్టోరీ ఇదే

శైలజారెడ్డి అల్లుడు సినిమా స్టోరీ ఇదే

0
138

నాగ చైతన్య కొత్త సినిమా శైలజారెడ్డి అల్లుడు . ఇప్పుడు ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి . ఈ సినిమాతో నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టడమే కాకుండా మీడియం రేంజ్ హీరోలలో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ కొట్టడం ఖాయమని రిలీజ్ కి ముందు నుండే సినిమా పై క్రేజ్ చూసి ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక సినిమా టాక్ ఎలా ఉంటుంది అన్నది పక్కకు పెడితే సినిమా స్టోరీ లైన్ మాత్రం పక్కగా వర్కౌట్ అయ్యేలానే ఉందని చెప్పొచ్చు. గర్వం, పొగరు ఎక్కువగా ఉండే తల్లి కూతుళ్ల నడుమ హీరో పడే పాటు హైలెట్ అంటున్నారు. హీరోయిన్ ని చూసిన వెంటనే ప్రేమించే హీరో.

తర్వాత తన స్వభావం చూసి ఎలాగైనా మార్చి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు, కానీ హీరోయిన్ కన్నా ఎక్కువ గర్వం పొగరు ఉండే అత్తని ఎలా మెప్పించి తన ప్రేమని సాధించాడు అన్నది సినిమా కథ అంటున్నారు. కచ్చితంగా ప్రేక్షకుల మనసు గెలిచే విధంగా ఉన్న స్టోరీ లైన్ కచ్చితంగా ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.