సెలూన్ లో ఓ వ్య‌క్తి హెయిర్ క‌టింగ్ చేయించుకుని న‌గ‌దు ఎంత ఇచ్చాడో తెలిస్తే షాక్

సెలూన్ లో ఓ వ్య‌క్తి హెయిర్ క‌టింగ్ చేయించుకుని న‌గ‌దు ఎంత ఇచ్చాడో తెలిస్తే షాక్

0
111

ఈ వైర‌స్ తో యావ‌త్ ప్ర‌పంచం లాక్ డౌన్ లో ఉంది, ఈ స‌మ‌యంలో అన్నీ దేశాలు కూడా లాక్ డౌన్ పాటిస్తున్నాయి, అయితే నిత్య అవ‌స‌ర వ‌స్తువులు మాత్ర‌మే తెచ్చుకుంటున్నారు, బ‌ట్ట‌లు ల‌గ్జ‌రీ గూడ్స్ షాపులు అన్నీ చోట్లా తెర‌చి సుమారు రెండు నెల‌లు అవుతోంది, అన్నీ వ్యాపార సంస్ధ‌లు మూతప‌డ్డాయి.

ఇక సెలూన్ షాపులు కూడా మూసే ఉన్నాయి, మ‌న దేశ‌మే కాదు అమెరికా, ర‌ష్యా ,జ‌పాన్, ర‌ష్యా, ఇలా అన్నీ చోట్లా సెలూన్లు కూడా మూసేశారు, ఇక లాక్ డౌన్ పై అమెరికాలో కూడా కొన్ని చోట్ల స‌డ‌లింపులు ఇచ్చారు, దీంతో అక్క‌డ సెలూన్లు తెర‌చుకున్నాయి. ఇక్క‌డ ఓ అనూహ్య సంఘ‌ట‌న జ‌రిగింది.

అమెరికాలోని కొలరాడోలో లాక్‌డౌన్ ముగిశాక సెలూన్లు తెరుచుకున్నాయి. అటువంటి పరిస్థితిలో హెయిర్ స్టయిలిస్ట్‌ ఇలిసియా నోవోట్నీ తన దుకాణానికి వచ్చే వినియోగదారుల ఎదురుచూస్తోంది. ఈ స‌మ‌యంలో ఓ వ్యక్తి ధ‌న‌వంతుడు వ‌చ్చి క‌టింగ్ చేయించుకున్నాడు, మొద‌ట ఆయ‌న ఎంత ఇస్తాడు అని ఎదురుచూసింది, వెంట‌నే అత‌ను 2500 డాల‌ర్ల ఇచ్చి వెళ్లాడు, దీంతో ఆమె సంతోషించింది, అత‌ను న‌వ్వుతూ ఈ న‌గ‌దు ఇచ్చి వెళ్లాడ‌ట‌.