సెలూన్ షాప్ తెరచి లోపల ఏముందో చూసి షాకైన ఓనర్

సెలూన్ షాప్ తెరచి లోపల ఏముందో చూసి షాకైన ఓనర్

0
89

ఈ లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, అయితే ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరికి అవకాశం లేదు.. అయితే కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది, ఈ సమయంలో సడలింపుల్లో భాగంగా చాలా మంది ఇప్పుడిప్పుడే దుకాణాలు తెరుస్తున్నారు, అతి జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలి అని తెలిపింది కేంద్రం..

ఇక అన్నీ జాగ్రత్తలు నిబంధనలు పాటిస్తున్నారు, తాజాగా బిహర్ లోని లాల్ గంజ్ ప్రాంతంలో ఓ సెలూన్ తీశాడు శ్రవన్ అనే వ్యక్తి, అయితే లోపల ఏమున్నాయో చూసి షాకయ్యాడు, సుమారు 15 తాచుపాములు అందులో ఉన్నాయి అన్నీ 10 అడుగుల పొడవు ఉన్నాయి, వెనుక ఉన్న బురద చెరువు నుంచి ఇందులోకి చేరుకున్నాయి.

దీంతో పైన ఉన్న కన్నం ద్వారా చేరుకున్నాయి, వెంటనే షట్టర్ క్లోజ్ చేసి అందరిని పిలిచాడు, చివరకు స్నేక్ ఫ్రెండ్ సొసైటీ వారికి చెప్పి ఆ పాములు పట్టించాడు, వారు వాటిని అడవిలో వదిలేశారు, ఇక ఇలా పాములు రాకుండా ఆ కన్నం పూడ్చారు, అందుకే వ్యాపారాలు చేసుకునే వారు జాగ్రత్తగా చూసి షాపులు తెరవండి.