శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశంలో అందరూ ఎంతో గొప్పగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు,
భాద్రపద మాసంలో… కృష్ణ పక్షంలో అష్టమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం… కృష్ణాష్టమిని ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో జరుపుకుంటారు.
శ్రీమహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణ భగవానుణ్ని చెప్పుకుంటారు. ఈ ఏడాది మనం జరుపుకునే ఆ కిట్టయ్య జన్మదినం కూడా చెబుతున్నారు పండితులు..ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం, ఇక అందరి ఇళ్లల్లో చిన్న పిల్లలని బాల కృష్నుడిలా అలంకరిస్తారు.
ఆగస్ట్ 11న 2020 న కృష్ణాష్టమి జరుపుకుంటున్నారు, అయితే ఈ కరోనా సమయంలో బయటకు ఎవరూ రాకుండా ఇంటిలో ఎవరికి వారు ఈ జన్మాష్టమిని జరుపుకోవాలని చెబుతున్నారు.