దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే ఉండేవి. అంతేకాదు నటులు, కధ, భారీ పెట్టుబడి, ఇవన్నీ వెండి తెరపై స్పష్టంగా కనిపించేవి. తర్వాత రోజుల్లో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జతచేశారు.
అందుకే ఇండియాలోనే కాదు ఆయన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఆసక్తిని కలిగించాయి.
ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనుండటం విశేషం. ఇప్పుడు ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. చరణ్ తో ఆయన సినిమా ప్రకటించిన సమయంలో, ఆయన ఏ స్టోరీ చేయనున్నారు అనే చర్చ అయితే ఇటు మెగా అభిమానుల్లో మొదలైంది.
ప్రస్తుతం ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు చేస్తున్నారు చరణ్. ఇక ఈ రెండు పూర్తి అయ్యాక శంకర్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు . అయితే శంకర్ తీస్తున్న సినిమా కథ ,రాజకీయాల నేపథ్యంలో నడవనున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే చరణ్ మాత్రం రాజకీయ నాయకుడిగా కనిపించరట. అవినీతి రాజకీయాలను అడ్డుకునే పౌరుడిగా కనిపిస్తాడని, లేకపోతే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ తర్వాత చిత్రం విడుదల కావచ్చు అంటున్నారు.