అతను ముంబైలో ఓ ప్రముఖ 5 స్టార్ హోటల్ లో చెఫ్ , అంతేకాదు అతనిని ఫాస్ట్ వర్కర్ అని కూడా అంటారు, కేవలం 2 నిమిషాల్లో 8 ఆనియన్స్ కోస్తాడు, అంత స్పీడ్ వర్కర్, సో కూరగాయలు కూడా అద్బుతంగా డిజైన్ గా కట్ చేస్తాడు, అయితే కోవిడ్ తో ఇప్పుడు ఇంటి పట్టున ఉంటున్నాడు, అతనికి హోటల్ నుంచి లక్ష 50 వేల జీతం వస్తోంది.
అయితే పేదలకు సాయం చేయాలి అని భావించాడు, తన మిత్రులతో కలిసి ఓ మిత్రుడి తోటలో మొత్తం కిరాణా వస్తువులు గ్యాస్ వంట సామాన్లు ఐదు లక్షల రూపాయలవి తీసుకువచ్చాడు.. రోజు 300 మంది పేదలకు స్లమ్ ఏరియాలో వారికి ఫుడ్ అందిస్తున్నాడు.. రోజూ కొత్త వెరైటీ ఫుడ్ వారికి చేసి అందిస్తున్నాడు.
అతను చేస్తున్న పనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది… అంతే లక్షల రూపాయలు అతనికి పంపుతున్నారు.. ఇప్పుడు ఏకంగా రోజుకి 1000 మందికి వండి పెడుతున్నాడు, కేవలం తను మరో ఇద్దరు ఫ్రెండ్స్ 1000 మంది పేదలకు ఉచితంగా ఆహరం వండుతున్నారు.