టిక్ టాక్ లైక్ ల కోసం చెండాలమైన ప‌ని అధికారులు సీరియ‌స్

టిక్ టాక్ లైక్ ల కోసం చెండాలమైన ప‌ని అధికారులు సీరియ‌స్

0
96

కొంద‌రు టిక్ టాక్ లో ఫేమ‌స్ అయ్యేందుకు ఇష్టం వ‌చ్చిన రీతిన వీడియోలు చేస్తున్నారు.. మ‌రికొంద‌రు సెల‌బ్రెటీలు అయ్యేందుకు కొన్ని ప్రాంక్ లు చేస్తున్నారు, అయితే కొన్ని మితిమీరి ఉంటున్నాయి, దీంతో నేరుగా పోలీసుల ద‌గ్గ‌ర‌కు కొన్ని కేసులు వ‌స్తున్నాయి.

తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన జాష్ పాప్కిన్ అనే టిక్‌టాక్ ప్రాంక్ స్టార్ చేసిన పని చూసి అంద‌రూ తిడుతున్నారు, ఓ పాల కంటైన‌ర్ లో ధాన్యం క‌లిపాడు, దానిని తీసుకుని ప్ర‌యాణం చేశాడు స‌బ్ వే రైలులో… ఇలా సబ్‌వే రైలు ఎక్కిన పాప్కిన్.. కావాల‌నే పాల కంటైన‌ర్ ట్రైన్ లో ప‌డేశాడు, తెలియ‌కుండా ప‌డింది అని క‌వ‌రింగ్ చేశాడు. పాలు అన్నీ ట్రైన్ లో వ‌లిగిపోయాయి.

కాని ఇది సీసీ టీవీల్లో రికార్డ్ అయింది, అత‌ని చ‌ర్య వ‌ల్ల అంద‌రూ అక్క‌డ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకున్నారు, అత‌ను చేసిన ప‌ని వ‌ల్ల అదంతా మా వ‌ర్క‌ర్లు క్లీన్ చేశార‌ని అత‌నిని వ‌దిలిపెట్టం అని అధికారులు అంటున్నారు, అత‌నికి ఫైన్ కూడా వేస్తామంటున్నారు సబ్‌వే రైలు అధికారులు.