ఉమ్మి వేసినందుకు ప్రశ్నించిన యువకుడు ? ఇద్దరికి గొడవ చివరకు మరణం

ఉమ్మి వేసినందుకు ప్రశ్నించిన యువకుడు ? ఇద్దరికి గొడవ చివరకు మరణం

0
106

అసలే వైరస్ కాలం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, అయితే ప్రభుత్వాలు కూడా రోడ్లపై ఉమ్మి వేస్తే ఫైన్ అని చెబుతున్నాయి, దేశ వ్యాప్తంగా ఈ చట్టం తీసుకువచ్చారు, పలువురికి ఫైన్ వేశారు, మాస్క్ పెట్టుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు, కాని కొందరు ఇంకా మూర్ఖంగానే ఇలా రోడ్లపై ఉమ్మి వేస్తున్నారు.

ఇలా ఉమ్మి వేయవద్దని చెప్పినందుకు జరిగిన ఘర్షణలో ఓ యువకుడి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. మందిర్ మార్గ్ ఏరియాలో అంకిత్ అనే వ్యక్తి రోడ్డుపై ఉమ్మివేశాడు. అక్కడనే ఉన్న ప్రవీణ్ వారించాడు.
ఇలా ఎందుకు ఉమ్మి వేశావు అని నిలదీశాడు, ఇలా ఇద్దరు చాలా సేపు గొడవ పడ్డారు దీంతో ఇది పోలీసుల వరకూ వెళ్లింది.

ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు అని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్దానికులు, ఇలా పోలీసులు వచ్చే సరికి వారిద్దరికి బలంగా గాయాలు అయ్యాయి,.తీవ్రగాయాలతో అంకిత్ మరణించాడు. ప్రవీణ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది.