వామ్మో ఈ పాము రేటు తెలిస్తే మతిపోతుంది ఏం చేస్తారో తెలుసా

వామ్మో ఈ పాము రేటు తెలిస్తే మతిపోతుంది ఏం చేస్తారో తెలుసా

0
110

మనకి పాములు చూడగానే భయం వేస్తుంది అన్ని విషసర్పాలు కాకపోయినా కొన్నింటిని చూస్తే మాత్రం వణికిపోతాం, కరిస్తే కాటికే అని భయపడిపోతాం, తాజాగా ఓ అరుదైన పాము తరలిస్తూ ఐదుగురు పోలీసులకు చిక్కిన సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. పాముని తీసుకువెళితే పోలీసులు పట్టుకోవడం ఏమిటి అనుకుంటున్నారా. దాని కథ తెలుసుకుందాం..

రెడ్ సాండ్ బో అనే జాతికి చెందిన అరుదైన పామును వీరు ఐదుగురు తరలిస్తున్నారు, వెంటనే వీరిని సర్సింఘర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్లో ఈ పాము ఖరీదు దాదాపు రూ.1.25 కోట్లుగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

అయితే ఇది విషపూరితమైన సర్పం కాదు. విషం లేని పాములను సాధారణంగా కొన్ని అరుదైన రకమైన ఔషధాలు, కాస్మెటిక్స్ తయారు చేసేందుకు వాడతారు.. అందుకే ఇది అంత ఖరీదైనది. అలాగే చేతబడి చేసేందుకు కూడా దీనిని వాడతారు, అందుకే దీనిని కస్టమర్ కు తీసుకువెళుతూ పోలీసులకు దొరికపోయారు వీరు.