పాంగ్ మీ అనే వ్యక్తి ఇటీవల తనకు ఆరోగ్యం బాగాలేదు అని ఆస్పత్రికి వెళ్లాడు, అయితే చైనా వైద్యులు ముందు అతనికి కోవిడ్ అని భయపడి చూశారు, చెక్ చేస్తే అతనికి వైరస్ లేదు, కాని అతనికి ఊపిరితిత్తుల సమస్య ఉంది. శరీరం కూడా రంగు మారుతోంది, ఇలా అనేక ఇబ్బందులు పడుతున్నాడు.
అయితే అక్కడ సీనియర్ డాక్టర్ నువ్వు ఎక్కువ ఏ ఆహరం తీసుకుంటావు అని అడిగారు.. ఎక్కువ సీ ఫుడ్ పాములు తింటాను అని చెప్పాడు, అంతేకాదు అతను పాములని పచ్చిగా తింటాడట పాము పిత్తాశయాన్ని కూడా పచ్చిగా తినేస్తానని తెలిపాడు.
అయితే అతను తినే ఆహరం చాలా డేంజర్ ఇలా పాములు పచ్చిగా తినడం బొద్దింకలు సీ ఫుడ్ పచ్చివి తినడం వల్ల అతనికి ఊపిరితిత్తుల్లో పురుగులు పట్టాయి, దీనిని పరాగోనిమియాసిస్ అంటారని తెలిపారు. ఆ పాములు సీ ఫుడ్ పచ్చిగా తినడం వల్ల వాటిలో జీవించే టేప్‌వార్మ్ వంటి పరాన్నజీవుల గుడ్లు శరీరంలోకి వెళ్తాయని, అక్కడే అవి పెద్దవై అనారోగ్యానికి గురిచేస్తాయని, అందుకే ఇలా అయింది అని తెలిపారు, అతను కేవలం వారం రోజులు మాత్రమే బతుకుతారు అని తెలిపారట.