సుందర్ లాల్ గుజరాత్ లో బంగారు దుకాణం నడుపుతున్నాడు, దూరం బంధువులు సంబంధం చెప్పడంతో అతను ఓ అమ్మాయిని పెళ్లి చూపులు చూశాడు, ఈ సమయంలో కట్నం లేకుండా అమ్మాయి అందంగా ఉండటంతో ఆమెని పెళ్లి చేసుకుంటాను అన్నాడు, అయితే ఆమె తల్లిదండ్రులు కట్నం ఇవ్వలేని స్దితి ఆమె అర్ధం చేసుకుని పెళ్లికి ఒప్పుకుంది.
కాని ఆమె అప్పటికే ఓ బేకరీలో క్యాషియర్ గా వర్క్ చేస్తోంది, అక్కడ ఓ సర్వీస్ బాయ్ తో లవ్ లో ఉంది, ఈ సమయంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు… కాని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, అయితే సుందర్ లాల్ ఆమెని పెళ్లి చేసుకుని, మూడు నెలలు అయినా ,ఆమె అతనితో కాపురం చేయలేదు.
చిన్న వయసు కాస్త బెట్టు అనుకున్నాడు.. కాని ఆమె ఓరోజు తన ప్రేమని చెప్పింది.. అతనిని మర్చిపోలేకపోతున్నా అని చెప్పింది, అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అడగడంతో నేను అతనితో వెళ్లిపోతా, అతను నన్ను బాగా చూసుకుంటాను అంటున్నాడు అని చెప్పంది, దీంతో ఇక చేసేది లేక ఆమె తల్లిదండ్రులకి చెప్పి, లవర్ కి ఇచ్చి వివాహం చేశాడు, ఆ పెళ్లి ఓ దేవాలయంలో తన ఖర్చుతో చేశాడు.