బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 హోస్ట్ మారతారా ? ఆ హీరో పేరు తెరపైకి

బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబర్ 5 నుంచి మొదలు కానుందని తెలుగు స్టేట్స్ లో ప్రచారం ఊపందుకుంది.

0
141

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని దీని కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తొలి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని,మూడు నాలుగు సీజన్స్ నాగార్జున చేసారు. ఇప్పుడు మళ్లీ ఈసారి హోస్ట్ ఎవరు ఉంటారా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతారు అని అందరూ అనుకున్నారు. కాని తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా సీజన్ 5 కి మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున స్థానంలో దగ్గుబాటి హీరో రానా వచ్చి చేరబోతున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే నాగార్జున ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా చేయాల్సిన సినిమాలు, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ అలాగే పెండింగ్లో పడిపోయాయి. దీంతో ఆయన ఈసారి సీజన్ కు కాస్త బ్రేక్ ఇస్తారు అని తెలుస్తోంది.

బుల్లితెరపై రానాకు మంచి ఫాలోయింగ్ ఉంది. నెం 1 యారీతో ఇప్పటికే రికార్డులు సృష్టించాడు రానా. సో ఇక బిగ్ బాస్ కు కూడా రానా హోస్ట్ గా బాగుంటారని అందరూ అనుకుంటున్నారు. భారీ రెమ్యునరేషన్ తో బిగ్ బాస్ సీజన్ 5 కు రానాకి ఆఫర్ వస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబర్ 5 నుంచి మొదలు కానుందని తెలుగు స్టేట్స్ లో ప్రచారం ఊపందుకుంది.