ఆ ద‌ర్శ‌కుడికి ర‌వితేజ ఛాన్స్ ఇవ్వ‌నున్నారా ? టాలీవుడ్ టాక్

Will Ravi Teja give a chance to that director?

0
129

ద‌ర్శకుడు శ్రీను వైట్ల సినిమాలు ఎంత బాగుంటాయో తెలిసిందే.. కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌ట్టిప‌డేస్తారు ఆయ‌న‌. ఇక ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు తీశారు. స్టార్ హీరోలు యంగ్ హీరోలు అంద‌రితో ఆయ‌న సినిమాలు చేశారు. అయితే ఎంత వేగంగా సినిమాలు చేశారు ఎన్నో హిట్లు చూశారు. కానీ ఆయ‌న మాత్రం ఇప్పుడు ఆ రేసులో లేరు. కానీ ఆయ‌న అభిమానులు మాత్రం ఆయ‌న నుంచి ఆ రేంజ్ సినిమాలు కోరుతున్నారు.

ప్రస్తుతం ఆయన చేతిలో మంచు విష్ణు డి అండ్ డి తప్ప మరో ప్రాజెక్టు లేదు. అయితే టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది.
సినిమాల్లో తనకి బ్రేక్ ఇచ్చిన శ్రీను వైట్ల గురించి రవితేజ ఆలోచన చేశాడట. మంచి క‌థ తీసుకురా నిర్మాత‌ని చూడు ఓ సినిమా చేస్తాను డేట్స్ ఇస్తాను అని ర‌వితేజ చెప్పారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

వెంకీ, దుబాయ్ శీను ఇలాంటి హిట్లు ఇచ్చారు ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల. ఇక ఆయ‌న‌కు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేశాడు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఓ మంచి స్టోరీ ఇచ్చి ఓ గుడ్ ఫిలిమ్ తీయాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మ‌రి ఈ వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది.