ప్రపంచంలో అతి డేంజర్ తెగ ఇదే – మనుషులు వెళ్తే ఇక తిరిగి రావడం కష్టం

ప్రపంచంలో అతి డేంజర్ తెగ ఇదే - మనుషులు వెళ్తే ఇక తిరిగి రావడం కష్టం

0
94

ఈ ప్రపంచంలో మనకు తెలిసింది చాలా తక్కువ తెలియంది చాలా ఉంది.. అయితే చాలా ప్రాంతాల్లో అనేక తెగల వారు ఉంటారు.. వారు వారి ఆచారాలు పద్దతులు సంప్రదాయాలు పాటిస్తారు.. ఇప్పుడు ఓ తెగ గురించి చెప్పుకోవాలి.

వారు దాదాపు 60 వేల సంవత్సరాలుగా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నారు.

 

అండమాన్ & నికోబార్ దీవుల దగ్గర ఈ తెగ వారు ఉంటారు, ఉత్తర సెంటినెల్ ద్వీపం అనేది ఉంది. ఇక్కడ ఈ తెగ వారు ఉంటారు…వీరి గురించి తెలుసుకోవాలి వీరి గురించి డాక్యుమెంటరీ చేయాలి అని చాలా మందికి ఉంటుంది.. కాని అది అంత సులువు కాదు..1967 నుంచి చాలా మంది ఇలా వారితో కలవాలి అని ప్రయత్నం చేశారు. కాని వారు కలవడానికి ఒప్పుకునేవారు కాదు.

 

సెంటినేలీస్ తెగ ప్రజలు వారి ప్రాంతంలోకి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోరు, అంతేకాదు వారిని చంపేస్తారు కూడా, ఇక వారు పారిపోతున్నా వదిలిపెట్టరు, సునామి వచ్చిన సమయంలో వీరికి సాయం చేద్దాము అని హెలీకాఫ్టర్ సాయంతో ఆహరం అందించినా వారు బాణాలు వేశారు కాని అవి తీసుకోలేదు.

 

2006లో చేపల వేట కోసం ఇద్దరు భారతీయ మత్స్యకారులు ఈ ద్వీపానికి దగ్గరగా వెళ్లడంతో సెంటినెలీస్ ప్రజలు వారిని చంపి ఇతర ప్రాంతాలపై తమకున్న విరక్తిని చూపించారు. 2018లో కూడా జాన్ అనే వ్యక్తిని చంపేశారు. మమ్మల్ని ఇలా ప్రశాంతంగా వదిలెయ్యాలి అని వారు కోరుతున్నారు..అందుకే ప్రజలు ఎవ్వరూ ఈ ద్వీపానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించకూడదని రూల్ ఉంది. కేవలం వారు ఇక్కడ లభించే పండ్లు కూరగాయలు మాత్రమే తింటారు. దాదాపు ఇక్కడ 400 మంది జనం ఉంటారట.