యాచకుడు ఇచ్చిన కంప్లైంట్ చూసి షాకైన పోలీసులు అతను ఏం రాశాడంటే

యాచకుడు ఇచ్చిన కంప్లైంట్ చూసి షాకైన పోలీసులు అతను ఏం రాశాడంటే

0
158

మనం మనిషిని చూసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు… పూరీ పుణ్యక్షేత్రంలో యాచకుడిగా జీవితాన్ని గడుపుతున్నారు గిరిజా శంకర్ . రిక్షా వాడితో ఓ తగాదా విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయనను చూసి అక్కడి వాళ్లు షాకయ్యారు… ముందు ఏమిటిరా మీ గొడవ అన్న పోలీసులు కూడా అతని చేతిరాత చూసి షాక్ అయ్యారు.

అసలు మీ గొడవకు కారణం ఏమిటో చెప్పు అంటే, తాను కంప్లైంట్ ఇస్తాను అని కంప్లైంట్ రాశాడు.. జస్ట్ నాలుగు లైన్లు ఫర్ ఫెక్ట్ గ్రామర్ తో మిస్టేక్స్ లేకుండా ఇంగ్లీష్ లో కంప్లైంట్ రాశాడు.. దీంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఆయనో ఇంజినీర్. పేరు గిరిజా శంకర్ మిశ్రా. ఊరు భువనేశ్వర్. వయస్సు 51ఏళ్లు. తండ్రి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన లేరు. తల్లి కూడా మరణించారు.

గిరిజా శంకర్ మిశ్రా.. సన్యాసిగా మారిన తర్వాత గుళ్లూగోపురాలు తిరుగుతూ.. యాచకుడిగా దొరికింది తింటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆయన మానసిన స్దితి బాగోక అలా మారిపోయారట, ఆయన బీఎస్సీ పూర్తయ్యాక.. ప్లాస్టిక్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ నుంచి సర్టిఫికేట్ పొందారు. తర్వాత ముంబైలో.. కొన్నిరోజులు హైదరాబాద్లో పని చేశారు. సీనియర్లతో గొడవ కారణంగా.. తన పదవికి రాజీనామా చేసి.. పూరీ చేరుకున్నారు. తర్వాత మానసికంగా ఇబ్బంది పడి సన్యాసిలా మారిపోయాడు.. తనకు అన్న చెల్లి అక్క ఉన్నారు అయినా వారిని కలవడానికి ఇష్టం లేదు అంటున్నాడు.. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తన దారి తాను చూసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.. కాని అతని గురించి డీటెయిల్స్ తెలుసుకుని వారి కుటుంబానికి తోబుట్టువులకి అందచేస్తామని చెబుతున్నారు పోలీసులు.