Hansika: కాబోయే భర్త ఫోటోలు షేర్‌ చేసిన హన్సిక

-

Heroine Hansika shares her fiance photos మెుదటి సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఖాతాలో వేసుకున్న హన్సిక తన సింగిల్‌ స్టేటస్‌కు గుడ్‌ బై చెప్పేసింది. తెలుగులో దేశముదురుతో అలరించిన అనంతరం.. దక్షిణాదిలోనే ఉంటూ పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. చిన్ననాటి స్నేహితుడితోనే ఏడడుగులు నడవబోతున్న ఈ నటి.. తన కాబోయే భర్త ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సోహైల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు హన్సిక (Hansika) ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద కాబోయే భర్తతో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అని ఫోటోల కింద క్యాప్షన్‌ పెట్టింది.

- Advertisement -

డిసెంబర్‌ 4న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యలో వీరి వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ రాజకోటలో జరగనుంది. డిసెంబర్‌ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాగా, ఈఫిల్‌ టవర్‌ వద్ద మోకాలిపై కూర్చొని, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ హన్సికకు సోహైల్‌ ప్రపోజ్‌ చేయగా.. అందుకు అంగీకరం తెలిపిన ఆమె.. అతడిని కౌగలించుకుంది. ఈ వేడుకనంతా అక్కడే ఉన్నవారు క్లిక్‌ మనిపించారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read also: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...