Surya Kiran | నటి కల్యాణి మాజీ భర్త, దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత

-

తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటి కల్యాణి మాజీ భర్త, దర్శకుడు సూర్యకిరణ్(Surya Kiran) కన్నుమూశారు. కొంత కాలంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

- Advertisement -

2003లో ‘సత్యం’ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. సుమంత్‌ హీరోగా నటించిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి సూర్యకిరణ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సుమంత్‌తోనే ‘ధన 51’ చిత్రం చేశారు. ఇక జగపతిబాబుతో ‘బ్రహ్మాస్త్రం’.. మంచు మనోజ్‌తో ‘రాజు భాయ్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కేరళకి చెందిన సూర్య కిరణ్‌(Surya Kiran) బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో మెప్పించారు. 1986లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ‘దొంగమొగుడు’, ‘సంకీర్తన’, ‘ఖైదీ నెం 786’, ‘కొండవీటి దొంగ’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. బాలనటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నారు.

దర్శకుడిగా కొనసాగుతున్న సమయంలోనే హీరోయిన్‌ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలానికే ఇద్దర విడిపోకయారు. తెలుగు బిగ్‌ బాస్‌ 4వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా సందడి చేశారు. కానీ తొలి వారంలోనే ఎలిమినేట్‌ అయ్యారు. సూర్యకిరణ్ ఆకస్మిక మృతి పట్ల తెలుగు, తమిళ చిత్ర ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

Read Also: ఆస్కార్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఓపెన్‌హైమర్’..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...