మహేష్ బాబు నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఫిక్స్

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఫిక్స్

0
126

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి .అతను ఇటీవల డైరెక్ట్ చేసిన ఎఫ్ 2 సినిమా మంచి హిట్ అయింది . ఆ సినిమా హిట్ అవ్వడంతో అతనికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. గోల్డెన్ ఛాన్స్ ఏమిటి అనుకుంటున్నారా ? అదే అండీ మన ప్రిన్స్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు . మహేష్ బాబు మహర్షి చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండే అయితే ఎఫ్ 2 తో ప్రభంజనం సృష్టించిన అనిల్ రావిపూడి లైన్లోకి రాగానే సుకుమార్ ని పక్కన పెట్టాడు మహేష్ .అనిల్ చెప్పిన లైన్ నచ్చడంతో వెంటనే డేట్స్ కూడా ఇచ్చేసాడు .

అయితే ఈ సినిమాని నిర్మించడానికి ఇద్దరు నిర్మాతలు పోటీ పడుతున్నారు దాంతో ఇద్దరినీ కలిపి చేయమని చెప్పడమా ! లేదా ? అన్న ఆలోచన చేస్తున్నాడట మహేష్ . ఆల్రెడీ దిల్ రాజు కన్ఫర్మ్ అయ్యాడు , ఇతను ఒక్కడే చేస్తాడా ? లేక అనిల్ సుంకర ని కూడా కలుపుతారా త్వరలోనే తేలనుంది . ఇక మహేష్ – అనిల్ రావిపూడి సినిమాకు అప్పుడే ఎనలేని డిమాండ్ ఏర్పడింది . ఈ సినిమా కోసం జియో పెద్ద ఆఫర్ ఇచ్చిందట కూడా అప్పుడే .మరి చూడాలి మహేష్ ఎవరికీ ఓకే చెప్తాడో.