తెలుగు లో రీఎంట్రీ ఇవ్వనున్న రేణు దేశాయ్

తెలుగు లో రీఎంట్రీ ఇవ్వనున్న రేణు దేశాయ్

0
33

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతోందట , అది కూడా తెలుగు సినిమాలో బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రేణు దేశాయ్ . మొదటి సినిమాలోనే పవన్ కళ్యాణ్ తో నటించడం వల్ల అతడితో సాన్నిహిత్యం ఏర్పడి పెళ్లి చేసుకుంది . తాను పెళ్ళికి ముందే సినిమాలు మానేసింది అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకోవడంతో పూణే వెళ్ళిపోయింది .

మళ్ళీ తెలుగు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో రేణు దేశాయ్ మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తోందట . మంచి పాత్ర లభిస్తే నటించడానికి సిద్ధం అవుతున్న ఈ భామ దర్శకురాలిగా కూడా ఓ చిత్రం చేసింది . అయితే అది అనుకున్న స్థాయిలో ఆడలేదు అందుకే మళ్ళీ నటన పై దృష్టి పెట్టినట్లుంది అని అంటున్నారు . మరి చూడాలి ఈ వార్త లో ఎంత నిజముందో.