షూటింగ్ కారణంగా వడదెబ్బకు గురైన న‌టి..షాక్ లో అభిమానులు

0
103

ప్రస్తుతం వేసవికాలం కావడంతో చాలామంది వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు ఎంతోమంది గురవ్వగా..తాజాగా ప్ర‌ముఖ బెంగాలీ న‌టి డొల‌న్ రాయ్ కూడా వడ్ఢబ్బకు గురై అభిమానులను షాక్ కు గురిచేసింది. అవుట్‌డోర్ షూటింగ్‌లో పాల్గొన‌డం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఓ సీరియ‌ల్ షూటింగ్ నిమిత్తం అవుట్‌డోర్ షూట్‌లో పాల్గొని గురువారం ఇంటికి వచ్చిన అనంతరం ఎండ దెబ్బకు గురికాగా..కోల్‌క‌తాలోని ఓ ఆస్ప‌త్రిలో చేర్పించడంతో వైద్యులు ప్ర‌స్తుతం డొల‌న్ రాయ్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని చెప్పడంతో అభిమానులకు కాస్త ఊరట కలిగింది. ఆమె న‌ట‌న‌కు ఎంతో మంది ప్ర‌శంస‌లు కూడా ల‌భించాయి..