నిత్యామీనన్ రాజ్ తరుణ్ ప్రేమ వార్తలు !!

నిత్యామీనన్ రాజ్ తరుణ్ ప్రేమ వార్తలు !!

0
70

గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయిన దర్శకుడు విజయ్ కుమార్ కొండ గతంలో నాగచైతన్యతో తీసిన ‘ఒకలైలా కోసం’ మూవీ ఫ్లాప్ కావడంతో ఈ దర్శకుడుకి అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో ఈ దర్శకుడు లేటెస్ట్ గా మొదలు పెట్టబోతున్న ఒక మూవీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ మేరకు విజయ్ కుమార్ కొండ త్వరలో ఒక వెరైటీ లవ్ స్టోరీ కథతో మళ్లీ ఎంట్రి ఇస్తున్నాడు. ఈ మూవీలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తే హీరోగా రాజ్ తరుణ్ నటించబోతున్నాడు. ఈ వెరైటీ కథ నిత్యామీనన్ కు నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ కు ఆమె ఓకె చెప్పినట్లు సమాచారం .

ఈమూవీ కథలో నీత్యా హీరో కన్నా వయసులో పెద్దదిగా ఉంటుంది. నిజానికి నిత్య రాజ్ తరున్ కన్న వయసులో పెద్దదే. అంతే కాదు ఇమేజ్ విషయంలో కూడ నిత్యామీనన్ రాజ్ తరుణ్ కన్నా చాలా పెద్ద స్థాయిలో కొనసాగుతున్న క్రేజీ హీరోయిన్. ఇలాంటి పరిస్థుతులలో వీరిద్దరూ ఒక సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించబోతున్నారు. గత కొంత కాలంగా చేతిలో సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ కు నిత్యామీనన్ ఎంట్రీ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.. ఈమూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ కథ వెరైటీగా కనిపించినా నిత్యామీనన్ రాజ్ తరుణ్ ల జంటను సగటు ప్రేక్షకులు అంగీకరిస్తారా వేచి చూడాలి మరి.