‘సమంత చాలా చీప్’.. స్క్రీన్ షాట్స్ బయట పెట్టిన నెటిజన్

-

భారీ అంచనాలతో విడుదలైన శాకుంతలం(Shaakuntalam) సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇతిహాసాన్ని అపహాస్యం చేశారంటూ క్రిటిక్స్ మండిపడుతున్నారు. స్త్రీ ఆత్మగౌరవం ప్రతిబింబించే శకుంతల క్యారెక్టర్ ని.. గ్లామర్ రోల్ చేసేశారని దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ సమంతపై సినిమా అభిమానులు మండిపడుతున్నారు. అందులోనూ సమంత డబ్బింగ్, గ్రాఫిక్స్ సినిమాని మరింత దిగజార్చాయని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. సోషల్ మీడియాలో మూవీ టీమ్ ని ట్యాగ్ చేసి మరీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలో ఏముందని అంతలా ప్రచారం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో ఓ నెటిజన్ సమంత(Samantha)పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సమంతా నువ్వు చాలా చీప్ అంటూ స్క్రీన్ షాట్స్ తో సహా పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ నెటిజన్ కి అంత కోపం ఎందుకు వచ్చింది అంటే.. సినిమా బాలేదన్నందుకు సమంత అతన్ని ట్విట్టర్ లో బ్లాక్ చేయడమే. ఓ నెటిజన్ ట్విట్టర్లో సమంతని ట్యాగ్ చేస్తూ.. “నేను చూసిన అన్ని సినిమాల్లోకెల్లా శాకుంతలం(Shaakuntalam) ఒక వరస్ట్ సినిమా. సమంత డబ్బింగ్ చాలా చండాలంగా ఉంది. ఇంకా ఓవరాక్షన్ చేసింది చాలు తగ్గు సమంత” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సమంత అతన్ని బ్లాక్ చేసింది.

ఇంకేముంది అతనికి కోపం రావడంతో.. సమంతకి చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్, బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ జత చేస్తూ మరొక పోస్టు పెట్టాడు. ‘జస్ట్ సినిమా బాలేదని చెప్పినందుకు నన్ను బ్లాక్ చేసింది. నువ్వు చాలా చీప్ సమంత’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతను అతను చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: అధికార పార్టీ ఎంపీతో హీరోయిన్ పరిణితీ చోప్రా ఎంగేజ్మెంట్ పూర్తి?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...