లవ్ ఎఫైర్‌పై స్పందించిన మిల్కీబ్యూటీ తమన్నా

-

టాలీవుడ్ స్టా్ర్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamanna) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో అగ్ర హీరోలతో నటించి శభాష్ అనిపించుకున్నది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా అవసరమైనప్పుడు ఐటమ్స్ సాంగ్స్‌లో నటిస్తూ రాణిస్తోంది. ఈ క్రమంలో తమన్నాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం కొనసాగిస్తున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

- Advertisement -

విజయ్ వర్మ కూడా పరోక్షంగా తమన్నాను ఉద్దేశించి పోస్ట్‌లు పెడుతుండటంతో ఆ వదంతులకు మరింత బలం చేకూరినట్లైంది. తాజాగా.. ఈ వార్తలపై తమన్నా క్లారిటీ ఇచ్చారు. ‘‘మేం ఇద్దరం కలసి ఒక వెబ్‌సిరీస్ చేశాం. ఫలితంగా ఇటువంటి రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఎక్కువగా నేను ఏం చెప్పలేను. నాపై ఇలా వదంతులు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. రియల్ లైఫ్‌లో ఏడడుగులు వేసే సమయానికి హీరోయిన్స్‌కు అనేక సార్లు పెళ్లి జరుగుతుంది. నాకు చాలా సార్లు డాక్టర్, బిజినెస్ మ్యాన్ వంటి భాగస్వాములను అంటగట్టారు.’’ వీటి గురించి పట్టించుకునే ఓపిక తనకు లేదని కొట్టి తమన్నా(Tamanna) పారేశారు.

Read Also: ఎదురుచూస్తోన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. రేపు ఏం జరుగబోతోంది!

Follow us on: Google News

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...