పృథ్వీరాజ్ కు అస్వస్థత.. హాస్పిటల్ బెడ్ పై నుండి వీడియో పంపిన నటుడు

-

30 ఇయర్స్ ఇండస్ట్రీ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్(Prudhvi Raj) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ బెడ్ పై నుండి తన ఆరోగ్య పరిస్థితిపై పృథ్వీరాజ్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇటీవల పృథ్వీరాజ్ తన కూతురి కోసం కొత్త రంగుల ప్రపంచం(Kotha Rangula Prapancham) అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్వయంగా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు పృథ్వీరాజ్. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ చేస్తుండగా పృథ్వీరాజ్ కళ్ళు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి బెడ్ పై నుండి పృథ్వీరాజ్(Prudhvi Raj) ఓ వీడియో రిలీజ్ చేశారు. తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో పంచుకున్నారు. కొత్త రంగుల ప్రపంచం సినిమా కోసం చాలా కష్టపడ్డామని, ఈ సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలని అభిమానులను వేడుకున్నారు పృధ్విరాజ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Read Also: మాలాంటి ముసలి వాళ్ళను చూసి యువత నేర్చుకోవాలి -సుధామూర్తి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...