Ayodhya Ram Mandir | రాముడి ప్రతిష్ట.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు

-

భారతీయులు ఎన్నో వందల సంవ్సతరాలుగా వేచి చూస్తున్న అద్భుతమైన క్షణం మరో పది రోజుల్లో ఆవిష్కృతం కానుంది. శతాబ్దాలుగా రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం.. అందులో రాములోరి విగ్రహం ప్రాణపతిష్ట గురించి వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. మొత్తానికి ఆ కల జనవరి 22న నెరవేరబోతుంది. ఆ రోజు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంతో పాటు “రామ్‌ లల్లా” విగ్రహం ప్రతిష్టం నభూతో నభవిష్యతీగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు విచ్చేయనున్నారు.

- Advertisement -

ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్..

అలాగే ఈ మహోత్తర కార్యక్రమానికి దేశంలోని అన్ని ప్రముఖ పార్టీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానపత్రికలు పంపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం పంపగా.. ఈ ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించింది. రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తాము గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నట్లుగా ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi), మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సహా కాంగ్రెస్ నేతలెవరూ అయోధ్య వెళ్లడం లేదని వెల్లడించింది. రామమందిర కార్యక్రమాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రైవేట్ కార్యక్రమంగా అభివర్ణించింది.

ఇదేనా సెక్యూలర్ పార్టీ విధానం..

అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం కొన్ని వర్గాల ఓట్లు పొందేందుకు కోట్ల మంది హిందూవులు వందల ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిరం ప్రారంభోత్సం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయడంపై మండిపడుతున్నారు. రామమందిరం(Ayodhya Ram Mandir) నిర్మాణం కొరకు దేశంలోని హిందువులతో పాటు ముస్లింలు కూడా తమ వంతు సాయంగా విరాళాలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని అవహేళన చేయడం తగదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లౌకికవాద పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్.. హిందూవుల మనోభవాలను ఎందుకు కించపరుస్తోందని ప్రశ్నిస్తున్నారు.

Read Also: రామయ్య ప్రాణప్రతిష్ట… మోదీ ప్రత్యేక వ్రతం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...