రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. MP సభ్యత్వాన్ని రద్దుచేసిన లోక్‌సభ

Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ఊహించని షాక్ తగిలింది. పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనపై దాఖలైన పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్లపాటు జైలుశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. తీర్పు వెల్లడైన మరుసటి రోజే కాపీని పరిశీలించి, లోక్ సభ తీసుకున్న నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో అలజడి రేగింది.

కాగా 2019 లో “దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?” అంటూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కోలార్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.

నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారించిన న్యాయస్థానం రాహుల్ కి రెండేళ్ల పాటు జైలు శిక్షవిధించింది. రాహుల్ అభ్యర్ధన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. హై కోర్టులో అప్పీలు దాఖలుకు వీలుగా 30 రోజుల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడినవారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా లోక్ సభ సచివాలయం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన రోజు నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులు అవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read Also: TSPSC పేపర్ లీకేజిలో ఆ విషయం తేల్చేసిన సిట్

Follow us on: Google News  Koo  Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here