కర్ణాటకలో బీజేపీని ఓడించలేదు.. తుడిచిపెట్టేశాం: రాహుల్ గాంధీ

-

బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ విజయ పరంపరను కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ(Telangana) సహా ఇతర అనేక రాష్ట్రాల్లోనూ బీజేపీని మట్టికరిపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదని, మొత్తం దేశమే ఈ విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. వాషింగ్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో కార్యక్రమాలను ముగించుకొని న్యూయార్క్‌ చేరుకున్నారు. అక్కడ ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ – యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

‘‘బీజేపీని తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలో మేం నిరూపించాం. మేం వారిని కేవలం ఓడించలేదు.. తుడిచిపెట్టేశాం’’ అని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ(BJP) అన్ని శక్తులను ఒడ్డి పోరాడింది. మా దగ్గర కంటే వారి దగ్గర 10 రెట్లు ఎక్కువ డబ్బు ఉంది. అయినా ఆ పార్టీని కాంగ్రెస్‌ తుడిచిపెట్టేసింది అని రాహుల్(Rahul Gandhi) చెప్పారు. తెలంగాణలోనూ ఇదే జరుగుతుందని, బీజేపీని తుడిచిపెట్టేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఉందో లేదో గుర్తించడం కష్టమవుందని ఎద్దేవా చేశారు. అలాగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ కనిపించకుండా పోతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న విద్వేష రాజకీయాలతో ముందుకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించడమే అందుకు కారణమన్నారు.

Read Also:
1. పెళ్లి కార్డుపై ధోనీ ఫోటో ముద్రించిన డై హార్డ్ ఫ్యాన్ 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...