దేశంలో మందు ప్రియులు, మందు ప్రియురాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. కరోనా నేపథ్యంలో గడిచిన రెండేళ్ల కాలంగా వరుస లాక్ డౌన్లు, రిస్టిక్షన్లు చోటు చేసుకున్నాయి. దీంతో మందు ప్రియులు, మందు ప్రియురాళ్లకు మందు దొరకడం కష్టంగా మారింది.
వారి అవస్థలను గుర్తించిన ఢిల్లీ రాష్ట్ర సర్కారు సరికొత్త కార్యక్రమానికి అనుమతించింది. ఇక నుంచి ఢిల్లీలో లిక్కర్ హోం డెలివరీకి స్థానిక కేజ్రివాల్ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మొబైల్ యాప్ ద్వారా కానీ వెబ్ పోర్టల్ ద్వారా కానీ ఆర్డర్ చేసిన వారికి నచ్చిన మందు హోం డెలివరీ అవుతుంది. ఢిల్లీ మందు ప్రియులకు కల్పించిన ఈ సౌకర్యం బాగుందని అనుకుంటున్నారా…? రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన వెసులుబాట్లు కల్పించే అవకాశాలు లేకపోలేదు.
కరోనా మొదటి వేవ్ లో లాక్ డౌన్ తర్వాత వైన్ షాపులకు అనుమతించిన సమయంలో క్యూలైన్లు చూసిన వారు ముక్కు మీద వేలేసుకున్నారు. మందు ప్రియులే కాదు.. మందు ప్రియురాళ్లు కూడా పెద్ద సంఖ్యలో వైన్ షాప్ ల ముందు నిలబడి కొనుక్కుని వెళ్లిన విషయం మనకు తెలిసిందే.
దీంతో వారి ఇబ్బందులకు చెక్ పెట్టడం కోసమే ఢిల్లీ సర్కారు హోం డెలివరీ స్కీం ప్రవేశపెట్టినట్లుంది.