ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో పొత్తులు ఓ కొలిక్కి వచ్చాయని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. కుటుంబపరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది కానీ రాజకీయాల్లో ఇది వర్తించదన్నారు. ఎన్డీఏ(NDA)గా కొత్త మిత్రులు వస్తున్నాయని చెప్పారు. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని తెలిపారు. తాము ఎప్పుడూ తమ మిత్రులను దూరం చేసుకోలేదని.. వారి రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా వారే దూరమయ్యారని వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఢిల్లీలో అమిత్ షా(Amit Shah)తో గంటపాటు సమావేశమై పొత్తుల గురించి చర్చించారు. అనంతరం సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. మరి ఈ రెండు పార్టీ్ల్లో ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందో వేచి చూడాలి.