ఏపీలో ఓ మంత్రి రాజీనామాకు సిద్దం

ఏపీలో ఓ మంత్రి రాజీనామాకు సిద్దం

0
32

తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై వైసీపీ నిత్యం వాటిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ..ఆ పార్టీకి మానస పత్రి క అయిన మీడియా పై కూడా వైసీపీ నిత్యం ఫోకస్ చేస్తుంది.. అయితే తాజాగా ఆ మీడియా వక్రీకరించి ప్రచురించిన కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి అవలంభిస్తున్నారట.. అంతేకాదు ఆయన ఎవరి మాట వినడం లేదట. దీని వల్ల ఏపీలో సమస్యలు పెరుగుతున్నాయట.

ఆయన మనసులో ఏదైనా అనుకుంటే అది అధికారులు నేతలు చేయాల్సిందే.. నిధులు లేవు అనడానికి లేదు… అయితే ఏపీ ఆర్ధిక పరిస్ధితి చూసి కూడా జగన్ ఇలా ఇష్టం వచ్చిన రీతిలో హమీలు ఖర్చు చేయడం వల్ల బడ్జెట్ సరిపోక ఇబ్బందులు పడాల్సి వస్తోందట, అందుకే ఆ మంత్రి జనవరి లేదా ఫ్రిబ్రవరిలో మంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట, మరో ఐదు సంవత్సరాలు ఇలా చేయడం తన వల్ల కాదు అని అంటున్నారట, అయితే ఈ వార్త మాత్రం సదరు ఎల్లో మీడయా రాయడంతో వైసీపీ దీనిని కొట్టిపారేసింది.