బాబుకు బిగ్ షాక్ నెల్లూరు జిల్లాలో మరో టీడీపీ వికెట్ డౌన్…

బాబుకు బిగ్ షాక్ నెల్లూరు జిల్లాలో మరో టీడీపీ వికెట్ డౌన్...

0
146

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… పార్టీ అధికారం కోల్పోయిన నాటినుంచి తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్న సంగతి తెలిసిందే… ఇప్పటికే చాలామంది సైకిల్ దిగి ఆయా పార్టీల్లోకి జంప్ చేశారు… ఇదే క్రమంలో మరికొందరు సైకిల్ దిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చెరారు…

నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు… ఆతర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు తాము ఆకర్షితులమయ్యామని అన్నారు… పార్టీ బలోపేతం కోసం తమవంతు కృషి చేస్తామని అన్నారు…

ఆతర్వాత కోటంరెడ్డి మాట్లాడుతూ… కొత్తాపాతల కలయికతో నెల్లూరు జిల్లాలో వైసీపీ బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన చేరికల కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు… పార్టీలో చేరిన వారికి ప్రాముఖ్యత ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు…