మరోసారి టీడీపీ పై బీజేపీ ఆశలు

మరోసారి టీడీపీ పై బీజేపీ ఆశలు

0
46

ఈసారి ఏపీలో అధికారంలోకి రాబోతున్నది ఎవరు అని ప్రశ్నిస్తే, వెంటనే వైసీపీ అని సర్వేలు చెబుతున్నాయి అని చెబుతున్నారు.. అలాగే వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఊహకు అందని మెజార్టీ వస్తుంది అని చెబుతున్నారు.. ఇక వైసీపీ సర్వేలు అదే చెబుతున్నాయి.. మీడియా సంస్ధల సర్వేలు అదే చెబుతున్నాయి.ఇక ఇటీవల బీజేపీ సర్వే చేయించింది అని ఆ సర్వే కూడా వైసీపీ గెలుస్తుంది అని వచ్చింది అని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ ఖాతాలో 110 స్ధానాలు వస్తాయని బీజేపీ చెబుతోంది.. కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తారు అని అంటున్నారు తెలుగు మీడియాతో ఇష్టాగోష్టిలో బీజేపీ నేత మురళీధర్రావు.. ఈ విషయాన్ని తెలియచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదక్షుడు అని టీడీపీ గెలిచినా ఆశ్చర్యంలేదు అని తెలియచేశారు .. మా లెక్కలో వైసీపీకి 110 సీట్లు పక్కాగా వస్తాయి అని చెప్పారాయన.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురశీధర్రావు ఇదే విషయాన్ని తెలియచేశారు.. ఇక తెలంగాణలో ఆరు పార్లమెంట్ స్ధానాలు గెలుస్తాము అని చెప్పారాయన.. మల్కాజిగిరి, మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్తోపాటు మరో రెండు లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. యూపీలో కూడా భారీ మెజార్టీ స్ధానాలు తమవే అని ఆయన తెలియచేశారు. ఇక తెలుగుదేశం పై మరోసారి బీజేపీ ఆశలు పెట్టుకుంది అని కూడా భావిస్తున్నారు నాయకులు.