21న వైసీపీ అభ్యర్దులతో జగన్ భేటీ

21న వైసీపీ అభ్యర్దులతో జగన్ భేటీ

0
33

ఈ నెల 21న తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో తన పార్టీ శాసనసభ, లోక్సభ అభ్యర్థులతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఏపీలో ఇప్పటి వరకూ పార్టీ నేతలు అందరూ ఫుల్ బీజీ అయ్యారు ఎన్నికలు అయ్యాయి ఇక ఫలితాలకు సమయం దగ్గరకు పడింది, ఈ సమయంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తమకే సానుకూలంగా ఉండబోతున్నాయని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన ఆయన.. 23న ఓట్ల లెక్కింపు రోజున ప్రధాన ఏజెంట్లు అనుసరించాల్సిన విధానంపై అభ్యర్థులకు కీలక సూచనలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈరోజు ప్రతీ ఒక్కరు హాజరు కావాలి అని 175 మంది అభ్యర్దులు 25 మంది ఎంపీ అభ్యర్దులు టూర్లు కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా కచ్చితంగా భేటీలో పాల్గొనాలి అని జగన్ తెలియచేశారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లిన కొందరు నేతలకు కూడా ఈ విషయం తెలియచేశారట.