చంద్రబాబుకి షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

చంద్రబాబుకి షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

0
88

ఏపీలో రాజధాని వివాదం మరింత ముదురుతోంది, ఇది రాజకీయ రంగు పులుముకుంది, ఇటు వైసీపీ టీడీపీ జనసేన మధ్య మాటల యుద్దం మొదలైంది, సీఎం జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు తెలుగుదేశం జనసేన నేతలు.

తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులాన్ని అడ్డు పెట్టుకుని అమరావతి జేఏసీ ముసుగులో ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు.

అమరావతి ఉద్యమంలో ఉన్నవారంతా కమ్మవాళ్లేనని శివకుమార్ ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో అమరావతికి చేసిందేమీలేదని విమర్శించారు. ఇది బాబు స్ధాపించిన నిర్మించిన పార్టీ కాదని ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని అన్నారు, ఇక్కడ రాజధాని ప్రాంతంలో కూడా బాబుని నమ్మక వైసీపీని ప్రజలు గెలిపించారు అని విమర్శించారు.