జగన్ పై చంద్రబాబు అదిరిపోయే పంచ్

జగన్ పై చంద్రబాబు అదిరిపోయే పంచ్

0
38

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఈసారి తాము విజయం పొందుతాము అని ధీమాగా చెబుతున్నారు.. ఓ పక్క టీడీపీకి పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభించింది అని ,ఇలాంటి పల్స్ ఎగ్జిట్ పోల్స్ తాము నమ్మం అని చంద్రబాబు చెబుతున్నారు. దాదాపు మేము 30 ఏళ్లుగా పార్టీ తరపున సర్వే చేయిస్తున్నాం, ఇలాంటి సర్వేలు నమ్మము అని చెబుతున్నారు. ఇక ఇంకా ఫలితాలు కూడా రాలేదు అయినా సరే వైసీపీ తమదే విజయం అని చెబుతోంది.. ఎంత ధీమా ఉందో అని ప్రజలు అనుకునేలా ఇలా చెబుతున్నారు అని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు.. ఇక బాబు కూడా వైసీపీ నేతలకు పంచ్ లు వేశారు.

ఇటీవల జగన్ ముఖ్యమంత్రి అని నేమ్ ప్లేట్ కూడా వైరల్ అయింది.. తాజాగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లు వారి విమర్శలపై బాబు విమర్శలు పంచ్ లు వేశారు.. జగన్ కేబినెట్ ఏర్పాటు పై చంద్రబాబు కూడా స్పందించారు. వైసీపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని చంద్రబాబు అంటున్నారు. ఇంగ్లీష్ టీవీ ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్, కొన్ని సంస్థల సర్వేల్లో 2014లోనూ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడమే ఇందుకు కారణమంటున్నారు. ఇలాగే మంత్రి వర్గం కూడా ఊహల్లోని జగన్ నిర్మించుకుంటున్నారు అని ఆయన విమర్శించారు.. గతంలో కూడా ఇలాంటి కామెంట్లు చేశారు.. ఇప్పుడు కూడా ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. ఇందులో నమ్మదగినది ఏమీ లేదు అని ఆయన విమర్శించారు. ఇక బీజేపీ నాయకులైతే ప్రతిపక్షం రాజకీయ ఐసీయూలోకి వెళ్లిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకూ కరెక్ట్ అనేది వారికే తెలియాలి అని ఆయన విమర్శించారు.