సీఎం జగన్ కు బిగ్ షాక్… వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు…

సీఎం జగన్ కు బిగ్ షాక్... వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు...

0
144

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి అయిన సంగతి తెలిసిందే… అయితే ఏడాది పూర్తి అయిందో లేదో అప్పుడే అసంతృప్తితో కొందరు నేతలు టీడీపీలోకి జంప్ చేస్తున్నారు… అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంకు చెందిన వైసీపీ నేతలు టీడీపీ తీర్ధం తీసుకున్నారు…

వారికి టీడీపీ ఇంచార్జ్ మద్దినేని ఉమా మహేశ్వర రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు… ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ…జగన్ మోహన్ రెడ్డి పాలన ఏడాది కావడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు సంబారాలు చేసుకుంటున్నారు…

పార్టీలో గుర్తింపు లేని కార్యకర్తలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది తిరగకుండానే తెలుగుదేశంపార్టీలోకి వలసలు ప్రారంభం అయ్యాయని అన్నారు… నాలుగేళ్ల అధికారం ఉండగానే పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షపార్టీ వైపు మొగ్గు చూపడం అంటే ముఖ్యమంత్రి పాలన ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు…