నేడే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..గెలుపు ఎవరిది?

Counting of votes tomorrow..who will win?

0
126

తెలంగాణలో డిసెంబర్ 10న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు మంగళవారం జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది.

రేపు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.70 శాతం పోలింగ్ నమోదు కాగా, 1324 మంది ఓటర్లకు గానూ 1320 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 99.22 శాతం పోలింగ్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 97.01 శాతం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 96.09 శాతం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం పోలింగ్‌ నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది.