విరాట్‌ కోహ్లిపై అమితాబ్‌ షాకింగ్‌ కామెంట్స్‌..వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్

Amitabh Bachchan's shocking comments on Virat Kohli..in viral Instagram post

0
40

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ ముందు తను దిగదుడుపే అంటూ సోషల్‌ మీడియా వేదికగా షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

160 మిలియన్‌ ప్లస్‌తో విరాట్‌ కోహ్లి నాకంటే అధికంగా ఉన్నాడు. ఈ విషయంలో విరాట్‌ నాకంటే చాలా శక్తివంతుడు. నాది చూడండి 29 మిలియన్ల ఎక్కడా? 160 మిలియన్ల ఎక్కడా?’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌కు తనకంటే ఎక్కువగా ఫాలోవర్స్‌ ఉన్నారంటూ చెప్పకనే చెపుకొచ్చాడు అమితాబ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. తనకంటే కోహ్లి శక్తివంతుడంటూ చెప్పుకొచ్చిన బిగ్‌బి పోస్ట్‌పై విరాట్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా టీమిండియా ఘోర ఓటములను ఎదుర్కొంది. పాకిస్తాన్ తో, న్యూజిలాండ్ తో పరాజయాలను చవిచూసింది. తొలి మ్యాచ్ నుంచి అంచనాలతో ఎదురూచూసి ఒక్కసారిగా జట్టు ఓడిపోవడంతో కెప్టెన్ ను తిట్టిపోస్తున్నారు టీమిండియా అభిమానులు.